ఉరికొయ్యకు వేలాడే రైతుల శవాలు కనిపించట్లేదా?: సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్
- అనాథలైన వారి కుటుంబాల ఆర్తనాదాలు వినిపించట్లేదా?
- అధికారపు పొరలు కమ్మి చూపు మందగించిందా?
- రైతులు కోటీశ్వరులయ్యారంటూ బుద్ధిలేని మాటలా?
అప్పుల బాధతో నిన్న ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు రైతుల విషయాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసి రాష్ట్ర సర్కార్ ను నిలదీశారు. నిన్న ప్రెస్ మీట్ సందర్భంగా రైతులు కోటీశ్వరులయ్యారంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.