భారీ చెట్టును కొట్టేయకుండానే ఇల్లు కట్టుకున్న వ్యక్తి.. ఫొటోలు వైరల్
- ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ లో ఇల్లు
- చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చేసుకున్న వ్యక్తి
- ఇప్ప చెట్టు ఇంటి మధ్యలో ఉన్న వైనం
చెట్టు కోసం ఇంటి డిజైన్‌ను మార్చేసుకుని ఇంటిని కట్టాడు. కొన్ని నెలల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టాడు. తాజాగా అది పూర్తయింది. తన స్థలంలోని ఓ ఇప్ప చెట్టు సరిగ్గా ఇంటి మధ్యలోకి వస్తుండటంతో ఇంటి ఆకృతిని మార్పు చేసి, చెట్టును కొట్టేయకుండా అలాగే ఉంచి మిద్దెమీదికి వెళ్లేందుకు వీలుగా ఓ చిన్నగదిని నిర్మించుకున్నాడు.
అంతేకాదు, కాంక్రీటు వల్ల చెట్టు ఎదగదన్న ఉద్దేశంతో ఆయన వెదురుబొంగులు, చెక్కలు, పెంకులతో గది పైకప్పును ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఆయనపై పర్యావరణ ప్రేమికులు, నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.