బిట్ కాయిన్ పై కేంద్రం వైఖరి వెల్లడించిన నిర్మలా సీతారామన్
- లోక్ సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం
- బిట్ కాయిన్ పై ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థికమంత్రి
- బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనలేదని వెల్లడి
- లావాదేవీల సమాచారం సేకరించలేదని వివరణ
లోక్ సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ద్వారా సొంత డిజిటల్ కరెన్సీ రూపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలో బిట్ కాయిన్ తరహా ఇతర క్రిప్టోకరెన్సీలను అనుమతించేది లేదని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో స్పష్టమైంది.