ఉత్తరాంధ్రకు ఐఎండీ తాజా వర్ష సూచన
- రేపు అండమాన్ సముద్రంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారుతుందని ఐఎండీ అంచనా
- పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని వెల్లడి
- డిసెంబరు 3 రాత్రి నుంచి ఉత్తరాంధ్ర, ఒడిశాపై ప్రభావం
డిసెంబరు 3 రాత్రి నుంచి రెండ్రోజుల పాటు ఉత్తర కోస్తా, ఒడిశాలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.