ఏపీలో మరో 184 మందికి కరోనా పాజిటివ్

ఏపీలో మరోసారి 200కి దిగువన కరోనా రోజువారీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 29,731 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 కేసులు వెల్లడి కాగా, కృష్ణా జిల్లాలో 34, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 214 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,198 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,55,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,163 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,432కి పెరిగింది.

Andhra Pradesh
Corona Virus
Today Cases
Media Report

More Telugu News