జీ 5 ఓటీటీ వేదికపై 'రిపబ్లిక్' చిత్రాన్ని వీక్షించిన సాయితేజ్

Republic movie releases on ZEE5 as Saitej watched the movie along with unit members
షార్ట్స్‌లో చూడండి
సాయితేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమా రూపొందింది. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమా, అక్టోబర్ 1వ తేదీన థియేటర్లకు వచ్చింది. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలోను .. సినిమా విడుదల సమయంలోను హాస్పిటల్లోనే ఉన్నాడు.

అహంభావంతో కూడిన ఒక రాజకీయ నాయకురాలికీ, ఆత్మాభిమానం .. ఆశయం .. ఆవేశం ఉన్న ఒక అధికారికి మధ్య జరిగే పోరాటం ఇది. జగపతిబాబు కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎక్కువమందికి రీచ్ కాలేకపోయింది. అందువలన ఈ సినిమాను జీ 5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా జనంలోకి తీసుకువెళ్లారు.

థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన సాయితేజ్, జీ 5 ఓటీటీ వేదిక ద్వారా చూశాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకుడు దేవ కట్టా .. స్క్రీన్ ప్లే రైటర్ కిరణ్ .. క్రియేటివ్ ప్రొడ్యూసర్ సతీశ్ బీకేఆర్ .. జీ స్టూడియోస్ తెలుగు కంటెంట్ హెడ్ ప్రసాద్ నిమ్మకాయలతో కలిసి సంతోషాన్ని పంచుకున్నాడు. ఇక ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందో చూడాలి.
Go Back to Shorts
Saitej
Aishwarya Rajesh
Ramyakrishna
Republic Movie

More Telugu News