జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడి ఘటన.. స్పందించిన బీజేపీ
- తాము శాంతియుతంగానే నిరసన తెలిపామన్న బీజేపీ కార్పొరేటర్లు
- పోలీసుల తోపులాటలో కుండీలు మాత్రమే ధ్వంసమయ్యాయన్న నేతలు
- కేసు నమోదు చేసిన పోలీసులు
- సీసీటీవీ ఫుటేజీ పరిశీలన అనంతరం బీజేపీ నేతలపైనా కేసులు
మరోవైపు, జీహెచ్ఎంసీ కార్యాలయంలో నిన్న ఆందోళన చేసిన బీజేపీ కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఆస్తిని ధ్వంసం చేసిన 32 మంది కార్పొరేటర్లపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన అనంతరం కార్పొరేటర్లతోపాటు వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్ కొందరు బీజేపీ గూండాలు హైదరాబాదులోని జీహెచ్ఎంసీ ఆఫీసును ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ దౌర్జన్యపూరిత వైఖరిని గట్టిగా ఖండిస్తున్నానని తెలిపారు. గాడ్సే భక్తులను గాంధేయ మార్గంలో నడవమని చెప్పడం ఎంత కష్టమో దీన్నిబట్టే అర్థమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరాచక శక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ను కోరారు. దీంతో కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.