Chevireddy Bhaskar Reddy: రాయల చెరువు వద్ద చంద్రబాబు కాన్వాయ్.... పైకిలేచి నమస్కరించిన చెవిరెడ్డి

Chevireddy wishes Chandrababu at Rayala Cheruvu
  • చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన
  • రాయల చెరువు సందర్శన
  • అప్పటికే అక్కడ మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న చెవిరెడ్డి
  • విపక్ష నేత పట్ల గౌరవమర్యాదలు ప్రదర్శించిన వైనం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని రాయల చెరువు వద్ద ఇవాళ ఆసక్తికర దృశ్యం కనిపించింది. జిల్లాలో వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు రాయల చెరువును కూడా సందర్శించారు. కాగా, అప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను చెవిరెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఇంతలో అక్కడికి చంద్రబాబు కాన్వాయ్ రావడంతో కోలాహలం నెలకొంది. అక్కడే ఇసుక బస్తాలపై విశ్రమించి ఉన్న చెవిరెడ్డి... చంద్రబాబు వాహనాన్ని చూసి గౌరవసూచకంగా పైకిలేచారు. కారులో ఉన్న టీడీపీ అధినేతకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ విపక్ష నేతను గౌరవించడం పట్ల నెటిజన్లు చెవిరెడ్డిని ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Chevireddy Bhaskar Reddy
Chandrababu
Rayala Cheruvu
Chittoor District

More Telugu News