Nara Lokesh: టీడీపీ కార్యకర్తను దారుణంగా కొట్టారంటూ వీడియో పంచుకున్న లోకేశ్

Lokesh shares a video of some people thrashed TDP worker in Guntur district
  • గుంటూరు జిల్లాలో టీడీపీ కార్యకర్తపై దాడి
  • ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశాడన్న లోకేశ్
  • కక్ష గట్టి దాడి చేశారని వెల్లడి
  • నరరూపరాక్షసులు అంటూ ఆగ్రహం
గుంటూరు జిల్లాలో ఓ టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీమూకలు అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను పంచుకున్నారు. ఓ వ్యక్తిని రోడ్డు డివైడర్ పై పడేసి కొందరు తీవ్రంగా కొట్టడం ఆ వీడియోలో కనిపించింది. దీనిపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అరాచకాలలో ఆఫ్ఘనిస్థాన్ ను మించిపోయిందని మండిపడ్డారు.

ఎన్నికల్లో టీడీపీ ఏజెంట్ గా పనిచేశాడన్న కక్షతో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదా అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీ రౌడీలు నరరూపరాక్షసుల కంటే ఘోరంగా దాడి చేశారని వెల్లడించారు.  ఈ ఘటన చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి భీతిగొలుపుతోందని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. పొలం తగాదా నెపంతో జరిపిన ఈ వైసీపీ ఫ్యాక్షన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. పోలీసులు నిద్ర నటిస్తుంటే వైసీపీ ఫ్యాక్షన్ మూకలు పట్టపగలు ఇలా బరితెగిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు.
Nara Lokesh
Video
TDP Worker
YSRCP
Attack
Guntur District

More Telugu News