రాష్ట్ర ప్రజల ఆశీస్సులే అండగా నిలిచాయి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్
- ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన గవర్నర్
- సతీసమేతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ రాక
- స్వాగతం పలికిన రాజ్ భవన్ వర్గాలు
- కరోనా పట్ల అశ్రద్ధ కూడదన్న గవర్నర్
వాక్సిన్ ఎంతో ఉపయోగపడిందని, సకాలంలో రెండు డోసుల వాక్సిన్ తీసుకోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు. రాష్ట్ర ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్త వహించాలని, తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎటువంటి అశ్రద్ధ కూడదని పేర్కొన్నారు. తప్పనిసరిగా మాస్కును ధరించటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరాన్ని పాటించటం వంటివి మరి కొంతకాలం కొనసాగించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.