ఎవరు వీళ్లంతా?.. చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆనంద్ మహీంద్ర వార్నింగ్
- ఆనంద్ మహీంద్ర పేరిట తప్పుడు కోట్
- తన మీద ఇంటర్నెట్ లో వేట కొనసాగుతోందని కామెంట్
- ఆ మాటలు తాను అనలేదని వివరణ

దాంతో పాటు స్టార్టప్ ఫౌండర్ పేరిట తనపై వచ్చిన ఫేక్ న్యూస్ ను ఆయన పోస్ట్ చేశారు. ‘‘ఓ సగటు భారతీయ పురుషుడు సోషల్ మీడియాలో మహిళలను అనుసరిస్తూ తన కాలాన్ని గడిపేస్తాడు. స్పోర్ట్స్ జట్లపై తన ఆశలను పెట్టుకుంటాడు. తన గురించి పట్టించుకోని రాజకీయ నాయకుడి చేతిలో తన కలలన్నీ పెడతాడు’’ అని పేర్కొంటూ మహీంద్ర ఫొటో కింద ఓ కోట్ ను స్టార్టప్ ఫౌండర్ అనే ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అది ఫేక్ అని పేర్కొంటూ ఆనంద్ మహీంద్రా వివరణ ఇవ్వాల్సి వచ్చింది.