ఆసీస్ మాజీ సారథి టిమ్ పైన్ బావ కూడా ఘనుడే... అదే మహిళతో అసభ్య చాటింగ్!
- ఇటీవల ఆసీస్ కెప్టెన్సీకి టిమ్ పైన్ రాజీనామా
- ఓ మహిళతో అసభ్య చాటింగ్
- అదే మహిళకు షానన్ టబ్ అశ్లీల సందేశాలు
- టిమ్ పైన్ సోదరిని పెళ్లాడిన షానన్ టబ్
బావబావమరుదులు ఇద్దరూ ఒకే మహిళతో ఫోన్ ద్వారా అసభ్య సంభాషణ సాగించారన్న విషయం ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలను కుదిపిస్తోంది. టబ్ పై ఆరోపణలు రావడంతో అతడి కోచింగ్ పదవి ఊడింది. టబ్ పై 2018లోనే ఆరోపణలు రాగా, టాస్మేనియా క్రికెట్ బోర్డు అప్పట్లోనే విచారణ షురూ చేసింది. మరోసారి ఆ అంశం తెరపైకి రావడం, టిమ్ పైన్ రాజీనామా చేయడం వంటి అంశాల నేపథ్యంలో టాస్మేనియా క్రికెట్ నుంచి టబ్ కు ఉద్వాసన పలికింది.