Sri Vishnu: ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించనున్న శ్రీవిష్ణు!

Arjuna Falguna movie update
  • శ్రీ విష్ణు హీరోగా 'అర్జున ఫల్గుణ'
  • దర్శకుడిగా తేజ మార్ని పరిచయం 
  • కథానాయికగా అమృత
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
శ్రీ విష్ణు ఇంతవరకూ చేసిన సినిమాలను ఒకసారి పరిశీలిస్తే, కొత్తదనం ఉన్న కథలకే ఆయన ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడనే విషయం అర్థమవుతుంది. అందువల్లనే ఆయన సినిమాలు కొన్ని పెద్దగా ఆడకపోయినా ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. ఆ కథల్లో కొత్తదనం .. ఆయన పాత్రల్లోని వైవిధ్యం వాళ్లకి బాగా నచ్చుతోంది.

అందువలన ఆయనకి వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా 'గాలి సంపత్' ఫలితం నిరాశ పరిచినా, 'అర్జున ఫల్గుణ' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎన్టీఆర్ వీరాభిమానిగా ఈ  సినిమాలో ఆయన కనిపించనున్నాడు. ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ల దగ్గర హడావిడి చేసే అభిమానిగా మెప్పించనున్నాడు.

ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కీ .. సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఇవి దూసుకుపోతున్నాయి. అందుకు కారణం కూడా ఎన్టీఆర్ అభిమానులే అనే టాక్ కూడా వినిపిస్తోంది. కథానాయికగా అమృత అలరించనుంది. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sri Vishnu

More Telugu News