Devineni Uma: కొండపల్లి మున్సిపాలిటీ ఓట్ల కౌంటింగ్ లో అధికార దుర్వినియోగం: దేవినేని ఉమ

Devineni Uma comments on Muncipal elections results
  • 1వ వార్డులో టీడీపీ గెలుపొందింది
  • ఆ తర్వాత ఫలితం వైసీపీకి అనుకూలంగా ఎలా వచ్చింది?
  • వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు
ఏపీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీకి అనుకూలంగా వస్తున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా గెలుపొందుతున్నారు. మరోవైపు కొండపల్లి మున్సిపాలిటీ ఓట్ల కౌంటింగ్ లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

1వ వార్డులో టీడీపీ గెలిచిందని, ఆ తర్వాత ఆ ఫలితం వైసీపీకి అనుకూలంగా ఎలా మారిందని ఆయన ప్రశ్నించారు. టీడీపీ విజయాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 'ఫలితాలను తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమనేది ఓటమిని ముందే ఒప్పుకున్నట్టే కదా ముఖ్యమంత్రి గారూ?' అని ప్రశ్నించారు.
Devineni Uma
Telugudesam
Municipal Elections
YSRCP

More Telugu News