CPI Ramakrishna: అదానీతో జగన్ కు ఉన్న లాలూచీకి ఇదే నిదర్శనం: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ

This is proof for relation between Adani and Jagan says CPI Ramakrishna
  • అమరావతి రైతుల ఉద్యమం చారిత్రాత్మకమైనది
  • రాజధాని విషయంలో బీజేపీ నాటకాలు ఆడుతోంది
  • సోలార్ విద్యుత్ కొనుగోళ్లను 22 రాష్ట్రాలు వ్యతిరేకించాయి
తెలంగాణ ఉద్యమాన్ని దేశ స్వాతంత్ర్య పోరాటంతో సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ పోల్చారు. అమరావతి రాజధాని కోసం ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఉద్యమం చారిత్రాత్మకమైనదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. అమరావతి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

రాజధాని విషయంలో బీజేపీ నాటకాలు ఆడుతోందని ఆయన అన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. సోలార్ విద్యుత్ కొనుగోలును 22 రాష్ట్రాలు వ్యతిరేకిస్తే... ఏపీ మాత్రం ఒక్క రోజులోనే ఆమోదించిందని దుయ్యబట్టారు. అదానీతో సీఎం జగన్ కు ఉన్న లాలూచీకి ఇదే నిదర్శనమని అన్నారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో వేల కోట్ల గోల్ మాల్ జరిగిందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు.
CPI Ramakrishna
Jagan
YSRCP
solar
Amaravati

More Telugu News