Akhil: మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన 'ఏజెంట్'

Acharya movie shooting update
  • అఖిల్ హీరోగా 'ఏజెంట్'
  • స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
  • కీలకమైన పాత్రలో మమ్ముట్టి    
అఖిల్ ఇప్పుడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు. చాలా కాలం తరువాత 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో ఆయనకు హిట్ పడింది. ప్రస్తుతం ఆయన 'ఏజెంట్' సినిమాతో బిజీగా ఉన్నాడు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన అఖిల్ లుక్ .. అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఒక స్పై థ్రిల్లర్ .. కథ ప్రకారం విశాఖపట్నం .. కృష్ణపట్నం పోర్టులలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూరప్ లోని బడా ఫెస్ట్ లో మేజర్ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటూ వచ్చింది.

రీసెంట్ గా అక్కడ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్ హైదరాబాద్ చేరుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట. దీంతో చాలావరకూ షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతుండగా, ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు..
Akhil
Sakshi Vaidya
Surendar Reddy
Agent Movie

More Telugu News