YSRCP: కుప్పంలో టీడీపీకి భారీ షాక్.. చంద్రబాబు కంచుకోటలో వైసీపీ పాగా!

YCP Victorious in Kuppam
  • ఇప్పటిదాకా 15 స్థానాల్లో గెలుపు
  • 17 వార్డుల కౌంటింగ్ పూర్తి
  • ఇప్పటికే మెజారిటీ వార్డులను గెలిచిన అధికార పార్టీ
టీడీపీ కంచుకోట, చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంను వైసీపీ బద్దలు కొట్టింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటిదాకా జరిగిన ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది.

25 వార్డులున్న కుప్పం కౌన్సిల్ లో 17 వార్డుల ఫలితాలు వెలువడగా.. అందులో వైసీపీ 15 స్థానాలను గెలుచుకుని ప్రతిపక్షానికి అందనంత దూరంలో నిలిచింది. టీడీపీ కేవలం 2 స్థానాలనే గెలిచింది. ఇప్పటికే వైసీపీకి మెజారిటీ స్థానాలు ఖరారైపోయినందున.. చైర్మన్ పదవి వైసీపీకి కన్ఫర్మ్ అయినట్టే.

కాగా, ఎన్నికలకు ముందు కుప్పంలో ఎంత హైడ్రామా నడిచిందో తెలిసిందే. టీడీపీకి చెందిన నేతలను పోలీసులు అక్రమ అరెస్టులు చేశారంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.
YSRCP
Andhra Pradesh
Telugudesam
Kuppam
Chandrababu
Chittoor District

More Telugu News