Koratala Siva: ఎన్టీఆర్ సినిమా షూటింగు మొదలెట్టేస్తున్న కొరటాల!

Koratala and Ntr Combo Update
షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా కొరటాల స్క్రిప్ట్ పై కసరత్తుకు ఎక్కువ సమయం తీసుకుంటాడు. షూటింగును మాత్రం చకచకా కానిచ్చేస్తాడు. అలాంటిది కరోనా కారణంగా 'ఆచార్య' షూటింగు విషయంలో కూడా జాప్యం జరిగింది. చిరంజీవి - చరణ్ కాంబినేషన్ సినిమా కావడంతో ఆయన బాధ్యత మరింత పెరిగింది. ఫిబ్రవరి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో జనవరి నుంచి మొదలవుతాయి గనుక, ఈ లోగా ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టడానికి కొరటాల రెడీ అవుతున్నాడని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో వచ్చే నెలంతా బిజీగా ఉంటాడు. అందువలన కొరటాల సినిమా షూటింగులో ఆయన పాల్గొనడు.

ఈ కారణంగా ఎన్టీఆర్ కాంబినేషన్లో లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ లో కొంత షూటింగు కానిచ్చేసి, 'ఆచార్య' షూటింగు తరువాత మళ్లీ మొదలుపెడతారట. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణతో కూడా కొరటాల ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.
Go Back to Shorts
Koratala Siva
Junior NTR
Acharya Movie
Chiranjeevi
Charan

More Telugu News