Nellore District: ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏపీలో ప్రారంభమైన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

municipal Elections votes counting started in Andhrapradesh
  • నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • మరో గంటలో తెలిసిపోనున్న ఓటింగ్ సరళి
  • సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతోపాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ లెక్కింపు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, పది గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Nellore District
Kuppam
Municipal Elections
Andhra Pradesh

More Telugu News