CM Jagan: సీఎం జగన్ ను కలిసిన కియా మోటార్స్ కొత్త ఎండీ

KIA Motors India new MD met AP CM Jagan
  • అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ
  • కియా మోటార్స్ ఇండియా కొత్త ఎండీగా టే జిన్ పార్క్
  • తాడేపల్లిలో సీఎం కార్యాలయంలో జగన్ తో భేటీ
  • ప్రభుత్వ సహకారం పట్ల కృతజ్ఞతలు తెలిపిన వైనం
కియా మోటార్స్ ఇండియా విభాగం నూతన ఎండీ, సీఈఓగా టే జిన్ పార్క్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంపై కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ సర్కారు అందిస్తున్న సహకారంతో తమ ఉత్పాదకత లక్ష్యాలను మించి కార్లను తయారుచేసి మార్కెటింగ్ చేయగలుగుతున్నామని సీఎం జగన్ కు వివరించారు. కరోనా సంక్షోభ సమయంలోనూ ప్రభుత్వం తమకు సాయంగా నిలిచిందని టే జిన్ పార్క్ పేర్కొన్నారు.

రేపటి క్యాబినెట్ సమావేశం వాయిదా


సీఎం జగన్ అధ్యక్షతన రేపు జరగాల్సిన క్యాబినెట్ సమావేశం వాయిదాపడింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఓ ప్రకటనలో వెల్లడించారు.


CM Jagan
KIA
MD
Andhra Pradesh

More Telugu News