మైక్ టైసన్ తో విజయ్ దేవరకొండ... అమెరికాలో లైగర్ షెడ్యూల్ ప్రారంభం

Liger new schedule begins starts in USA
  • విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్'
  • పూరీ జగన్నాథ్ దర్శకత్వం
  • కీలకపాత్రలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్
  • అప్ డేట్ ను పంచుకున్న చిత్రబృందం
మహాబలుడు మైక్ టైసన్ ఓ తెలుగు సినిమాలో నటిస్తుండడం లైగర్ తో సాధ్యమైంది. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న 'లైగర్' లో టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. లైగర్ చిత్రం మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) నేపథ్యంలో తెరకెక్కుతోంది.

 తాజాగా మైక్ టైసన్, విజయ్ దేవరకొండలపై సన్నివేశాలను అమెరికాలో తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు నూతన షెడ్యూల్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా రిలీజ్ చేసింది. పూరీ కనెక్ట్స్, ధర్మ మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది.
Go Back to Shorts
Liger
New Schedule
USA
Mike Tyson
Vijay Devarakonda
Puri Jagannadh
Tollywood

More Telugu News