Kajal Aggarwal: భర్తను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు కాజల్ అగర్వాల్ ప్రయత్నం!

Kajal Aggarwal trying to bring her husband in to film industry
  • గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న కాజల్
  • ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు
  • తన భర్తకు సినిమాల్లో అవకాశం ఇవ్వాలని డైరెక్టర్లను కాజల్ అడుగుతోందనే ప్రచారం
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలలో నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు, తన భర్త గౌతమ్ ను సినీ పరిశ్రమకు పరిచయం చేసే పనిలో కాజల్ ఉందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తన వద్దకు వస్తున్న దర్శకులతో తన భర్తకు ఒక పాత్ర ఇవ్వాలని ఆమె అడుగుతోందట. ఆమె భర్తకు కూడా నటనపై ఆసక్తి ఉందని అంటున్నారు. మరి ఈ వార్త నిజమే అయితే కాజల్ భర్తను మనం సినీ నటుడిగా చూసే అవకాశం ఉంటుంది.
Kajal Aggarwal
Husband
Acting
Film Offer
Tollywood
Bollywood

More Telugu News