Radhe Shyam: "ఈ రాతలే"... ప్రభాస్ 'రాధేశ్యామ్' నుంచి తొలి పాట విడుదల

First single released from Radhe Shyam
  • ప్రభాస్, పూజ హెగ్డే జంటగా 'రాధేశ్యామ్'
  • 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో చిత్రం
  • జస్టిన్ ప్రభాకరన్ సంగీతం
  • ఈ రాతలే పాటకు సాహిత్యం అందించిన కృష్ణకాంత్

ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. 'రాధేశ్యామ్' చిత్రం నుంచి తొలి పాట లిరికల్ వీడియో రిలీజైంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. "ఈ రాతలే" అంటూ సాగే లవ్లీ సాంగ్ ను నేడు లిరికల్ వీడియో రూపంలో విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. 'రాధేశ్యామ్' చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో వస్తోంది.

  • Loading...

More Telugu News