రాజ్ తరుణ్ కి హిట్ దక్కేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజ్ తరుణ్ కి హిట్ దక్కేనా?

Raj Tarun New Movie Anubhavinchu Raja
  • ఆరంభంలో వరుస హిట్లు
  • ఇటీవల దక్కని విజయాలు
  •  తాజా చిత్రంగా 'అనుభవించు రాజా'
  • ఈ నెల 26వ తేదీన విడుదల  
తెలుగు తెరపై నిఖిల్ తరువాత బాగా యాక్టివ్ గా ఉండే యంగ్ హీరో రాజ్ తరుణ్ అని చెప్పుకోవచ్చు. 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెరకి పరిచయమైన రాజ్ తరుణ్, ఆ తరువాత 'కుమారి 21F' .. 'సినిమా చూపిస్తమావ' సినిమాలతో మంచి హిట్లు అందుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆ తరువాత కూడా ఆయన మిగతా యంగ్ హీరోలతో పోటీపడుతూ వెళ్లాడు.

ఆడియన్స్ తో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ వచ్చాడుగానీ .. విజయాలను మాత్రం అందుకోలేకపోయాడు. మొదట్లో అతనిని మురిపించిన సక్సెస్ లు ఆ తరువాత ముఖం చాటేస్తూ వచ్చాయి. దాంతో ఆయన హిట్ అనే మాట వినక చాలాకాలమే అయింది. ఎప్పటికప్పుడు కాస్త కొత్తగా అనిపించిన కథలను చేసుకుంటూ వచ్చాడుగానీ, ఏ ప్రయత్నం కూడా ఆయనకి విజయాన్ని అందించలేకపోయింది.

ఈ నేపథ్యంలోనే ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై 'అనుభవించు రాజా' చేశాడు. గ్రామీణ నేపథ్యంలో .. యూత్ తో పాటు మాస్ కంటెంట్ కూడా కలిగిన సినిమా ఇది. ఈ సినిమాలో జీవితానికి అర్థం .. పరమార్థం ఎంజాయ్ చేయడమే అనే కోణంలో ఒక పాటను వదిలారు. సర్దుకుపోతేనే జీవితం సరదాగా ఉంటుందనే కోణంలో మారో పాట వదిలారు. పల్లెలో జల్సా రాయుడిగా కనిపించిన రాజ్ తరుణ్, పట్నంలో బుద్ధిగా జాబ్ చేసుకుంటూ కనిపిస్తున్నాడు. చూస్తుంటే ఇది వైవిధ్యభరితమైన కథగానే కనిపిస్తోంది. ఈ నెల 26వ తేదీన వస్తున్న ఈ సినిమాతోనైనా ఆయనకి హిట్ పడుతుందేమో చూడాలి.
Raj Tarun
Anubhavinchuraja Movie
26th November Release

More Telugu News