'కాట్సా' చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా
- 2019లో రష్యాతో భారత్ ఒప్పందం
- ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొనుగోలు
- భారత్ ను హెచ్చరించిన అప్పటి అధ్యక్షుడు ట్రంప్
- కాట్సా పరిధిలోకి భారత్
రష్యా నుంచి భారత్ 2019లో ఎస్-400 మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కొనుగోలు చేసింది. దాంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా కొత్త ప్రభుత్వం స్పందిస్తూ, భారత్ కు కాట్సా నుంచి మినహాయింపులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పూర్తిగా, పాక్షికంగా ఎవరికీ మినహాయింపు కల్పించే వెసులుబాటు కాట్సా చట్టంలో లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి. ఇది భారత్ కు కూడా వర్తిస్తుందని వివరించాయి.
2014లో రష్యా బలగాలు క్రిమియాపై దురాక్రమణకు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న అమెరికా... రష్యాకు దూరంగా ఉండాలంటూ తన మిత్రదేశాలకు స్పష్టం చేసింది.