Actress: హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో నటి చౌరాసియాపై దాడి.. గాయాలు

Attack on actress in Hyderabad KBR Park
  • ఒంటరిగా ఉన్న నటిపై దుండగుడి దాడి
  • ఫోన్ లాక్కునే ప్రయత్నంలో పెనుగులాట
  • నటిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై ఈ ఉదయం దాడి జరిగింది. ఒంటరిగా ఉన్న ఆమెపై దాడిచేసిన దుండగుడు మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో నటికి స్వల్పంగా గాయాలయ్యాయి.

చివరికి ఆమె చేతుల్లోంచి ఫోన్ గుంజుకున్న దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చౌరాసియా 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గాయపడిన నటి చౌరాసియాను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Actress
Courasia
Attack
KBR Park
Hyderabad

More Telugu News