Kangana Ranaut: కంగనా రనౌత్ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: మహారాష్ట్ర బీజేపీ చీఫ్

Kangana comments on Indian independence completely wrong says Maharashtra BJP chief
  • దేశ స్వాతంత్ర్యంపై కంగన వివాదాస్పద వ్యాఖ్యలు
  • స్వాతంత్ర్య ఉద్యమంపై నెగెటివ్ గా మాట్లాడే హక్కు ఏ ఒక్కరికీ లేదన్న చంద్రకాంత్ పాటిల్
  • భావోద్వేగంలో ఆమె అలా మాట్లాడి ఉండొచ్చని వ్యాఖ్య
మన దేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని... 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాతే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆమె వ్యాఖ్యలను మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ కూడా తప్పుపట్టారు. కంగన వ్యాఖ్యలు ముమ్మాటికీ సరికాదని ఆయన అన్నారు.

స్వాతంత్ర్య ఉద్యమంపై నెగెటివ్ గా మాట్లాడే హక్కు ఏ ఒక్కరికీ లేదని ఆయన చెప్పారు. ఏదో భావోద్వేగంలో ఆమె అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కొంత వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత నిజమైన స్వాతంత్ర్యం ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమయిందని చెప్పారు. 2014లో మోదీ పీఎం అయిన తర్వాత పేదల ఆకలి తీరిందని చెప్పారు. దేశంలో రెండు పూటల కంటే తక్కువగా ఆహారాన్ని తీసుకునేవారు ఎవరూ లేరని అన్నారు. పేదలకు కేంద్ర ప్రభుత్వం రూ. 105కే 35 కేజీల ఆహార ధాన్యాలను ఇస్తోందని చెప్పారు.
Kangana Ranaut
Bollywood
Chadrakant Patil
BJP
Maharashtra
Independence

More Telugu News