విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీపై అనిశ్చితి.... రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించే అవకాశం!
- ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తొలగింపు
- కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ
- వన్డే కెప్టెన్సీపై కోహ్లీతో చర్చించనున్న బీసీసీఐ
- దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ముందే నిర్ణయం!
ఇప్పటికే భారత జట్టు టీ20 కెప్టెన్సీ పగ్గాలను రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ...50 ఓవర్ల ఫార్మాట్లోనూ అతడినే కెప్టెన్ గా నియమించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో వన్డే కెప్టెన్సీపై కోహ్లీతో బీసీసీఐ చర్చించనుంది. మరికొన్ని నెలల్లో దక్షిణాఫ్రికా సిరీస్ ఉంది. ఈ సిరీస్ కు ముందే వన్డే కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవాలని బోర్డు భావిస్తోంది.