తల్లీకూతుళ్లపై అత్యాచారం కేసులో యూపీ మాజీమంత్రికి జీవితఖైదు
- 2017లో గాయత్రి ప్రజాపతిపై ఓ మహిళ ఫిర్యాదు
- సుప్రీం ఆదేశాలతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
- ముగ్గురిని దోషులుగా నిర్ధారించిన లక్నో కోర్టు
- జీవితఖైదుతో పాటు రూ.2 లక్షల చొప్పున జరిమానా
ఈ కేసుపై అప్పట్లో సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సుప్రీం ఆదేశాలతో పోలీసులు ప్రజాపతి, ఆయన అనుచరులపై గ్యాంగ్ రేప్ సెక్షన్లు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. చివరికి ఈ కేసులో నలుగురు నిర్దోషులుగా బయటపడగా, మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతిని, ఆయన అనుచరుల్లో ఇద్దరిని లక్నో స్పెషల్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఆ ముగ్గురికి జీవితఖైదు, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించింది.