Chiranjeevi: కథ వినకుండానే చిరూ 'ఖైదీ'కి ఓకే చెప్పారట!

Paruchuri said about Chiranjeevi Khaidi movie
  • చిరంజీవిగారికి ఎన్నో హిట్లు ఇచ్చాము
  • 'ఖైదీ' సినిమా సంగతి వేరు
  • ముందుగా ఆయన కథ వినలేదు
  • క్లాప్ కొట్టిన తరువాత వినడం జరిగిందన్న పరుచూరి

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'ఖైదీ' ముందు వరుసలో కనిపిస్తుంది. ఇటీవలే ఈ సినిమా 38 సంవత్సరాలను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ .. "చిరంజీవిగారితో కలిసి 'ఖైదీ' సినిమాకు పనిచేసే అవకాశం మాకు 1983లో లభించింది. ఆ సినిమా ఒక చరిత్ర సృష్టించింది.

'ఖైదీ' సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. 38 ఏళ్లు గడిచిపోయినా, చిరంజీవిగారి పేరు చెప్పగానే ఆయన అభిమానులందరికీ 'ఖైదీ'నే గుర్తుకు వస్తుంది. 'ఘరానా మొగుడు' .. 'గ్యాంగ్ లీడర్' .. 'ఇంద్ర' .. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' .. ఇలాంటి చాలా సినిమాలకి రాశాము.

ఈ సినిమాలన్నీ కూడా సూపర్ హిట్లే .. కానీ 'ఖైదీ' సంగతి వేరు. ఈ కథను చిరంజీవిగారు వినకుండానే ఓకే చేయడం మేము జీవితంలోనే మరిచిపోలేనటువంటి విషయం. ఆ సినిమాకి క్లాప్ కొట్టిన తరువాత చిరంజీవిగారు ఆ కథను వినడం జరిగింది. అప్పటికే ఆయనకి స్టార్ డమ్ వుంది. అయినా ముందుగా కథ వినకుండా ఓకే చెప్పడం విశేషం" అని చెప్పుకొచ్చారు.

Chiranjeevi
Paruchuri
Khaidi

More Telugu News