SI Rajeswari: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్వయంగా భుజాలపై మోసిన లేడీ ఎస్సై... వీడియో వైరల్

Lady police inspector saves man in Chennai
  • చెన్నైలో భారీ వర్షాలు
  • రోడ్డు పక్కన స్పృహలేని స్థితిలో వ్యక్తి
  • ఆటో వరకు మోసుకొచ్చిన ఎస్సై రాజేశ్వరి
  • హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
సమాజంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. శాంతిభద్రతలే కాదు, ఆపన్నులను ఆదుకోవడంలోనూ తాము ముందుంటామని ఓ మహిళా ఎస్సై తాజాగా నిరూపించారు. భారీ వర్షాలతో జలమయమైన చెన్నై నగరంలోని టీపీ చత్రం ప్రాంతంలో ఓ అభాగ్యుడు అపస్మారక స్థితిలో ఉండగా, రాజేశ్వరి అనే లేడీ ఎస్సై అతనిని స్వయంగా తన భుజాలపై వేసుకుని మోశారు.

రోడ్డు పక్కన విరిగిపడిన చెట్ల కొమ్మల మధ్య ఓ వ్యక్తి పడివున్నట్టు సమాచారం అందుకున్న ఆమె వెంటనే స్పందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకుని చెట్ల కొమ్మలను తొలగించి, ఆ వ్యక్తిని కాపాడారు. అతడిని ఆటో వరకు మోసుకొచ్చారు. స్థానికుల సహకారంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లేడీ ఎస్సై మానవతా దృక్పథానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.
SI Rajeswari
Man
Chennai
Rains

More Telugu News