పద్మశ్రీ అవార్డుతో హర్యానా సీఎం ఇంటిముందు నిరసన చేపట్టిన పారా అథ్లెట్
- మంగళవారం పద్మశ్రీ అందుకున్న వీరేందర్ సింగ్
- బుధవారం అదే అవార్డుతో సీఎం ఇంటివద్ద దీక్ష
- పారా అథ్లెట్లందరికీ సమానహక్కులు కల్పించాలని డిమాండ్
- గతంలో అర్జున అవార్డు అందుకున్న సింగ్
బధిర క్రీడాకారులకు కూడా ఇతర పారా అథ్లెట్లతో సమానంగా హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం పారా అథ్లెట్లు అందరినీ ఒకేలా చూస్తున్నప్పుడు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమానత్వం చూపడంలేదని వీరేందర్ సింగ్ ప్రశ్నించారు. బధిర క్రీడాకారులకు కూడా సమాన హక్కులు కల్పించేంత వరకు సీఎం ఇంటి ముందు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.