Tollywood: ప్రభాస్ సరసన కొరియా ముద్దుగుమ్మ.. ఫారిన్ హీరోయిన్ ను ఎంపిక చేసిన డైరెక్టర్!

Prabhas To Romance Korean Beauty In Upcoming Movie Spirit
  • అర్జున్ రెడ్డి ఫేం వంగా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో ‘స్పిరిట్’
  • హీరోయిన్ గా సాంగ్ హై క్యో ఎంపిక
  • విలన్ గా కరీనా కపూర్ ను ఎంచుకున్నట్టు టాక్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాంచి జోష్ మీదున్నాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోతున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘రాధేశ్యామ్’ విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత కూడా చేతిలో నాలుగు సినిమాలను పెట్టుకున్నాడు ప్రభాస్. ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కే’, ‘స్పిరిట్’ వంటి సినిమాలను ఒప్పుకొన్నాడు. అన్నీ కూడా పాన్ ఇండియా మూవీస్ కావడం మరో విశేషం.


అయితే, అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా ప్రభాస్ కు జోడీగా ఓ ఫారిన్ ముద్దుగుమ్మను ఎంచుకున్నట్టు చెబుతున్నారు. కొరియా టీవీ డ్రామాలతో ఫేమ్ సంపాదించుకున్న కొరియన్ బ్యూటీ సాంగ్ హై క్యోను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి, ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Tollywood
Prabhas
Sandeep Reddy Vanga
Song Hye Kyo

More Telugu News