Tollywood: నిన్ను నమ్మే వారిని మోసం చేయకు.. వెంకీ వైరల్ పోస్ట్

Hero Venkatesh Viral Post In Instagram
  • ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటున్న హీరో
  • వరుసగా పోస్టులు పెడుతున్న వైనం
  • చై–సామ్ గురించేనంటూ నెటిజన్ల కామెంట్
ఇటీవలి కాలంలో హీరో వెంకటేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంతకుముందు సినిమా అప్ డేట్లు మాత్రమే ఇచ్చిన ఆయన.. కొంతకాలంగా లైఫ్ కు సంబంధించిన కొటేషన్లను షేర్ చేస్తున్నారు. ఎక్కువగా పాజిటివ్ కోట్స్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి పోస్టే ఇప్పుడు ఒకటి వైరల్ అయింది.

‘‘నిన్ను ఇష్టపడే వారిని ఎప్పుడూ దుర్వినియోగం చేయొద్దు. నువ్వు అవసరమైన వారికి ఎప్పుడూ బిజీ అని చెప్పొద్దు. నిన్ను నిజంగా నమ్మే వారిని మోసం  చేయకు. నిన్ను గుర్తుంచుకునే వారినెప్పుడూ మరచిపోకు’’ అనే ఒక పోస్టును ఆయన తన ఇన్ స్టా స్టోరీస్ లో పంచుకున్నారు. దీనిపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు వినిపిస్తున్నారు. చై–సామ్ లకే పరోక్షంగా హితబోధ చేస్తున్నారని కొందరంటే.. లైఫ్ కు సంబంధించి కేవలం పాజిటివ్ కోట్స్ చేస్తున్నారంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tollywood
Venkatesh Daggubati
Viral Posts

More Telugu News