వరంగల్ లో టీఆర్ఎస్ విజయగర్జన సభ మరోసారి వాయిదా
- ఈ నెల 29న సభ జరపాలని భావించిన టీఆర్ఎస్
- వరంగల్ వద్ద ఏర్పాట్లు
- ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- కోడ్ అమలుతో నిలిచిపోయిన సభ
దీనికోసం మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఈ ఉదయం సభాస్థలిని కూడా పరిశీలించారు. 12 లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. సభ కోసం 300 ఎకరాలు, వాహనాల పార్కింగ్ కోసమే 1,500 ఎకరాలు సేకరించినట్టు వివరించారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ మధ్యాహ్నం విడుదల కావడంతో విజయ గర్జన సభకు కోడ్ అడ్డంకిగా మారింది.
అంతేకాదు, ఈ బుధవారం కేసీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పలు అభివృద్ధి పనులను పరిశీలించాల్సి ఉండగా, ఆ పర్యటన కూడా వాయిదా పడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబరు 10న జరగనున్నాయి.