Kajal Aggarwal: ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ అగర్వాల్

Kajal Aggarwal response on pregnacy news
  • తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్
  • కాజల్ గర్భవతి అంటూ సినీ ఇండస్ట్రీలో టాక్
  • సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెపుతానన్న కాజల్

టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తన చిరకాల మిత్రుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లైన తర్వాత ఆమె తన భర్తతో కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. మరోవైపు, కాజల్ అగర్వాల్ ప్రస్తుతం గర్భవతి అనే వార్త చాలా రోజులుగా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తపై ఇంతకాలం స్పందించకుండా మౌనంగా ఉన్న కాజల్.. ఇప్పుడు మౌనం వీడారు.
 
తన ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు మాట్లాడటం తనకు ఇష్టం లేదని కాజల్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను తానే చెపుతానని అన్నారు. మాతృత్వం ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పారు. తన సోదరి నిషా అగర్వాల్ తల్లి అయిన తర్వాత ఆమె జీవితం ఎలా మారిపోయిందో తాను చూశానని అన్నారు. నిషా పిల్లల సమక్షంలో తాను ఒక తల్లిగానే ఫీల్ అవుతానని చెప్పారు.

  • Loading...

More Telugu News