నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నేతలు
- సీఎం కేసీఆర్, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం
- కేసీఆర్ పై బీజేపీ కిసాన్ మోర్చా నేతల ఆగ్రహం
- కేసీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడన్న బండి సంజయ్
- అబద్ధాల శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించారని ఎద్దేవా
అంతకుముందు, బండి సంజయ్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ అన్నీ అవాస్తవాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గింజా తానే కొంటానని, కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారని తెలిపారు. 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారో లేదో నిపుణులతో కలిసి తేల్చాలని డిమాండ్ చేశారు. సీఎం స్థాయి వ్యక్తి ఈ విధంగా అబద్ధాలు చెప్పొచ్చా? అబద్ధాల కోసమే కేసీఆర్ ఒక శాఖను ఏర్పాటు చేసి, ఆ శాఖ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగించాడని బండి సంజయ్ విమర్శించారు.