Komatireddy Venkat Reddy: ఇక రేపట్నించి చూస్కోండి... సమరశంఖం పూరించిన కోమటిరెడ్డి

Komatireddy met VH and talks to media about his action plan
  • ఉద్యమం ప్రారంభిస్తున్న కోమటిరెడ్డి
  • కామారెడ్డి జిల్లాలో మృతి చెందిన కుటుంబానికి రేపు పరామర్శ
  • కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడి
  • పార్టీ కోసం ఏంచేయాలో ఆలోచిస్తున్నామని వివరణ
కాంగ్రెస్ పార్టీ తన ప్రాణమని, అధినేత్రి సోనియా గాంధీ తన దేవతని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. రేపటి నుంచి తన ఉద్యమం షురూ అవుతుందని, ఇక తానేంటో చూపిస్తానని అన్నారు.

ఇవాళ సీనియర్ నేత వీహెచ్ తో భేటీ అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ తో కూడిన ప్రత్యేక తెలంగాణ సాకారమైందంటే అందుకు సోనియానే కారణమని తెలిపారు. కానీ అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా ఉందని, పార్టీ పునర్ వైభవం కోసం ఏంచేయాలో ఆలోచిస్తున్నట్టు కోమటిరెడ్డి వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.

కామారెడ్డి జిల్లా లింగంపేటలో మృతి చెందిన రైతు కుటుంబాన్ని కలుస్తానని, రేపు కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి నుంచి తన ఉద్యమం ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక, కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ దశలో పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన ఆయన, పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించకపోయినా, తన వ్యాఖ్యలతో అసంతృప్త నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Komatireddy Venkat Reddy
VH
Congress
Telangana

More Telugu News