Australia: టీ20 వరల్డ్ కప్: విండీస్ తో పోరులో ఆస్ట్రేలియా టార్గెట్ 158 రన్స్
- గ్రూప్-1లో కీలక సమరం
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్
- మొదట బ్యాటింగ్ చేసిన విండీస్
- 44 పరుగులతో రాణించిన కెప్టెన్ పొలార్డ్
ఆస్ట్రేలియాతో టీ20 వరల్డ్ కప్ గ్రూప్-1 లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ పోరాడదగ్గ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ కీరన్ పొలార్డ్ 44 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ ఎవిన్ లూయిస్ 29, హెట్మెయర్ 27 పరుగులు సాధించారు.
ఇక తమ కెరీర్ లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న గేల్ 15, బ్రావో 10 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో హేజెల్ వుడ్ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. స్టార్క్, కమిన్స్, జంపా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 158 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది.