Australia: రెండో సెమీస్ బెర్తు కోసం... వెస్టిండీస్ తో ఆస్ట్రేలియా కీలక సమరం

Australia faces West Indies in a crucial encounter
  • గ్రూప్-1లో నేడు ఆసక్తికర మ్యాచ్ లు
  • మరో మ్యాచ్ లో ఇంగ్లండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • నేటితో ముగియనున్న గ్రూప్-1 లీగ్ మ్యాచ్ లు
  • దాదాపుగా సెమీస్ చేరిన ఇంగ్లండ్!
టీ20 వరల్డ్ కప్ లో సూపర్-12 దశలో భాగంగా నేడు గ్రూప్-1లో ఆసక్తికర మ్యాచ్ లు జరగనున్నాయి. అబుదాబిలో జరిగే తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. ఆసీస్ కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. గ్రూప్-1లో ఆ జట్టు 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో ఉంది. నేడు వెస్టిండీస్ పై గెలిస్తే సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి.

అయితే ఈ సాయంత్రం జరిగే మరో మ్యాచ్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్ 4 మ్యాచ్ ల్లో 4 విజయాలతో సెమీస్ బెర్తు దాదాపు ఖరారు చేసుకోగా, దక్షిణాఫ్రికా కూడా మరో సెమీస్ బెర్తుపై కన్నేసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా గెలిస్తే... ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లలో మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ కు వెళుతుంది.

వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా ఓడిపోతే దక్షిణాఫ్రికా రన్ రేట్ తో పనిలేకుండా నేరుగా సెమీస్ చేరుతుంది. ఒకవేళ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు నేటి మ్యాచ్ లలో ఓడిపోయినా నెట్ రన్ రేటే కీలకమవుతుంది.
Australia
West Indies
Semis
T20 World Cup

More Telugu News