Raghu Rama Krishna Raju: రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం: రఘురామ

Raghurama comments on Maha Padayatra
  • కొనసాగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర
  • దిగ్విజయంగా సాగుతోందన్న రఘురామ
  • పాదయాత్రలో దాడులు జరగొచ్చని వ్యాఖ్యలు
  • కుట్రలు జరుగుతున్నాయని వెల్లడి
అమరావతి రైతుల మహాపాదయాత్ర దిగ్విజయంగా జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అయితే రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా దాడులు జరిగే ప్రమాదం కూడా ఉందని పేర్కొన్నారు. రాజధాని రైతులంటే టీడీపీ కార్యకర్తలన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదం అని విమర్శించారు. బొత్స వెనుక ఎవరో ఉన్నారని రఘురామ వ్యాఖ్యానించారు. రాజధాని ప్రజలపై బొత్స తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసేందుకు రెక్కీ నిర్వహించారని రఘురామ ఆరోపించారు. దీనిపై ఆధారాలతో సహా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశానని, ఏపీ డీజీపీ అడిగితే ఆధారాలు అందజేస్తానని తెలిపారు.
Raghu Rama Krishna Raju
Maha Padayatra
Farmers
Andhra Pradesh

More Telugu News