Pawan Kalyan: మహేశ్ బాబుకు దీపావళి గిఫ్టులు పంపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan sends Deepavali gift to Mahesh Babu
  • స్వీట్లు, పర్యావరణహిత టపాసులు పంపిన పవన్
  • ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన నమ్రతా శిరోద్కర్
  • హరీశ్ శంకర్, క్రిష్ లకు కూడా బహుమతులు పంపిన పవన్
దీపావళి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఎంతో మంది తాము అభిమానించే వారికి కానుకలు, బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. టాలీవుడ్ లో కూడా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పండుగను పురస్కరించుకుని మహేశ్ బాబుకు జనసేనాని పవన్ కల్యాణ్ బహుమతులు పంపారు. పవన్ పంపిన బహుమతుల బాక్స్ లో స్వీట్స్ తో పాటు, పర్యావరణహిత పటాసులు ఉన్నాయి.

ఈ విషయాన్ని మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పవన్, అన్నా లెజినోవా దంపతులు గిఫ్టులు పంపారని చెప్పారు. 'థాంక్యూ అన్నా అండ్ పవన్. హ్యాపీ దివాలీ' అంటూ ధన్యవాదాలు తెలిపారు. ముందు నుంచి కూడా పవన్ కల్యాణ్, మహేశ్ బాబుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అన్నట్టు దర్శకులు క్రిష్, హరీశ్ శంకర్ లకు కూడా పవన్ గిఫ్టులు పంపారు.
Pawan Kalyan
Janasena
Mahesh Babu
Tollywood
Deepavali Gifts

More Telugu News