Shankar: ట్రైన్ నేపథ్యంలోని యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను పూర్తిచేసిన శంకర్!
- చరణ్ తో సెట్స్ పైకి వెళ్లిన శంకర్
- కొన్నిరోజులుగా జరుగుతూ వచ్చిన షూటింగ్
- అన్బు - అరివు నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్
- కథానాయికగా కియారా అద్వాని
చరణ్ హీరోగా శంకర్ ఒక భారీ సినిమాను రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. పూణేలో ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ మొదలుపెట్టారు. చరణ్ - కియారాపై అక్కడ ఒక పాటను 12 రోజుల పాటు చిత్రీకరించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తిచేసినట్టుగా చెబుతున్నారు.
ఈ సినిమాలో ట్రైన్ నేపథ్యంలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా శంకర్ డిజైన్ చేయించినట్టుగా చెప్పుకున్నారు. ఆ ఎపిసోడ్ నే అక్కడ చిత్రీకరించారు. రైలు పట్టాలపై కులాసాగా కూర్చున్న శంకర్ ఫొటో వలన క్లారిటీ వచ్చింది.
భారీ యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేయడంలో అన్బు - అరివు సిద్ధహస్తులు. వాళ్ల నేతృత్వంలోనే ఈ యాక్షన్ ఎపిసోడ్ ను పూర్తి చేశారు. కొన్ని రోజుల ముందు శంకర్ .. చరణ్ బృందం ఉన్న లొకేషన్లో హెలికాఫ్టర్ కనిపించింది. హెలికాఫ్టర్ ద్వారా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారనే అనుకోవాలి. ఈ సినిమాలో శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.