Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఎన్టీఆర్ షేర్ చేసిన ఫొటో వైరల్!

NTR Wishes Fans A Happy Diwali
  • ఒకే రకమైన డ్రెస్‌లో మెరిసిపోతున్న కుమారులు
  • అబ్బాయిలు ముద్దుగా ఉన్నారంటూ కామెంట్లు
  • ‘ట్రిపుల్ ఆర్’ కోసం ఎదురుచూస్తున్నామన్న అభిమానులు
దీపావళి రోజున యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన ఎన్టీఆర్.. దీపాలు వెలిగించిన చోట కుమారులతో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.

ఒకే రకమైన డ్రెస్‌లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ తనయులను చూసిన అభిమానులు శుభాకాంక్షలతో ట్విట్టర్‌ను హోరెత్తించారు. అబ్బాయిలు ముద్దుగా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తే.. ట్రిపుల్ ఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మరికొందరు కామెంట్ చేశారు. ఆ ఫొటోను పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు.


Junior NTR
RRR
Diwali
Tollywood
Abhay Ram
Bhargav Ram

More Telugu News