షారుఖ్ ఖాన్ కు లేఖ రాసిన రాహుల్ గాంధీ.. లేఖలో ఏముందంటే..!
- ఆర్యన్ జైలుకు వెళ్లిన ఆరు రోజులకు రాహుల్ లేఖ
- దేశం మొత్తం మీ వెంట ఉందన్న రాహుల్
- బెయిల్ పై జైలు నుంచి విడుదలైన ఆర్యన్
ఆర్యన్ ఖాన్ జైలుకు వెళ్లిన ఆరు రోజులకు షారుఖ్ కు రాహుల్ లేఖ రాశారు. 'దేశం మొత్తం మీ వెంట ఉంది' అని లేఖలో రాహుల్ చెప్పారు. 23 ఏళ్ల ఆర్యన్ కు బాంబే హైకోర్టు అక్టోబర్ 28న బెయిల్ మంజూరు చేసింది. గత శనివారం జైలు నుంచి ఆర్యన్ బెయిల్ పై విడుదలయ్యాడు. అక్టోబర్ 2న క్రూయిజ్ షిప్ పై ఎన్సీబీ జరిపిన దాడిలో ఆర్యన్ అరెస్టయ్యాడు. అప్పటి నుంచి దాదాపు నాలుగు వారాల పాటు ఆయన జైల్లో గడిపాడు.