హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణకు శస్త్రచికిత్స
- కొంతకాలంగా భుజంనొప్పితో బాధపడుతున్న బాలకృష్ణ
- అక్టోబరు 31న కేర్ ఆసుపత్రిలో చేరిక
- 4 గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు
- కోలుకోవడంతో నేడు డిశ్చార్జి
శస్త్రచికిత్స అనంతరం బాలకృష్ణ కోలుకోవడంతో నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు బాలయ్యకు సూచించారు. కాగా, బాలకృష్ణకు 2018లోనూ కుడిచేతికి రొటేటింగ్ కఫ్ సమస్య రావడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించారు.