టీ20 వరల్డ్ కప్: అజేయ ఇంగ్లండ్ తో శ్రీలంక ఢీ
- షార్జాలో జరుగుతున్న మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
- సూపర్ ఫామ్ లో ఉన్న ఇంగ్లండ్
- ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విజయం
లంక బౌలర్లలో స్పిన్నర్ వనిందు హసరంగ ఒక్కడే కాస్త మెరుగ్గా కనిపిస్తున్నాడు. మిగతా బౌలర్లు కూడా రాణించాల్సి ఉంది. ఇంగ్లండ్ ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా లంక ప్రణాళికలు ఫలించడం కష్టమేననిపిస్తోంది. గ్రూప్-1లో ఉన్న ఈ రెండు జట్లు చెరో మూడు మ్యాచ్ లు ఆడాయి. సూపర్-12 దశలో ఇంగ్లండ్ తాను ఆడిన మూడు మ్యాచ్ ల్లో నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక కేవలం ఒక మ్యాచ్ లోనే నెగ్గింది.