అమెజాన్ ప్రైమ్ ఒడిలోకి 'మరక్కార్'
- భారీ చారిత్రక చిత్రంగా 'మరక్కార్'
- నిజమైన వీరుడి చుట్టూ అల్లుకున్న కథ
- కరోనా కారణంగా రిలీజ్ లో జాప్యం
- కీలకమైన పాత్రలో అర్జున్
భారీ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమా ఈ పాటికే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా థియేటర్లకు వస్తుందని అంతా అనుకుంటున్న సమయంలో, తాము ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేసినట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు. దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఈ సినిమాకి భారీ ఆఫర్ రావడం వల్లనే డైరెక్ట్ రిలీజ్ చేసుకునేలా మేకర్స్ అమ్మేశారని తెలుస్తోంది. నిజానికి ఇది థియేటర్లలో చూడవలసిన 'బాహుబలి' తరహా భారీ సినిమా. అలాంటి ఈ సినిమా త్వరలోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా పలకరించనుంది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అర్జున్ .. సునీల్ శెట్టి .. మంజూ వారియర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.