Suriya: ఇరులర్ గిరిజన తెగ ప్రజల కోసం తమిళనాడు సీఎంకు రూ.1 కోటి విరాళం ఇచ్చిన సూర్య, జ్యోతిక

Kollywood hero Suriya donates one crore rupees to Tamilnadu CM Stalin
  • సూర్య దంపతుల సామాజిక సేవా దృక్పథం
  • సీఎం స్టాలిన్ ను కలిసిన సూర్య, జ్యోతిక
  • 2డీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ తరఫున విరాళం
  • ఇరులర్ విద్యార్థుల కోసం నిధులు వెచ్చించాలని విజ్ఞప్తి
తమిళ స్టార్ హీరో సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి అనేక రూపాల్లో సామాజిక సేవ చేస్తున్నారు. తాజాగా, సూర్య తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ.1 కోటి విరాళం అందించారు. నేడు సూర్య, జ్యోతిక దంపతులు సీఎం స్టాలిన్ ను కలిసి తమ 2డీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ తరఫున చెక్ ను అందించారు. ఆ కోటి రూపాయల మొత్తాన్ని ఇరులర్ గిరిజన తెగ ప్రజల సంక్షేమం కోసం వినియోగించాలని సీఎంను కోరారు. ఇరులర్ తెగ విద్యార్థులకు ఉపయోగపడేలా ఆ నిధులను ఖర్చు చేయాలని సూర్య, జ్యోతిక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత జస్టిస్ చంద్రు, పళంగుడి ఇరులర్ ట్రస్టు సభ్యులు కూడా పాల్గొన్నారు.
Suriya
Jyothika
Donation
CM Stalin
Irular Tribe
Tamilnadu

More Telugu News