West Indies: టీ20 వరల్ల్ కప్: బంగ్లాదేశ్ కు 143 రన్స్ టార్గెట్ ఇచ్చిన వెస్టిండీస్

West Indies set target to Bangladesh
  • కొనసాగుతున్న సూపర్-12 దశ
  • గ్రూప్-1లో బంగ్లాదేశ్ వర్సెస్ వెస్టిండీస్
  • షార్జాలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
టీ20 వరల్డ్ కప్ లో నేడు బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు తలపడుతున్నాయి. సూపర్-12 గ్రూప్-1లో జరుగుతున్న ఈ పోరుకు షార్జా మైదానం వేదిక. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. లోయరార్డర్ లో వచ్చిన నికొలాస్ పూరన్ 40 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 22 బంతులు ఎదుర్కొన్న పూరన్ 1 ఫోర్, 4 సిక్సర్లు బాదాడు. రోస్టన్ చేజ్ 39 పరుగులు చేశాడు.

క్రిస్ గేల్ (4), ఎవిన్ లూయిస్ (6), హెట్మెయర్ (9), ఆండ్రీ రస్సెల్ (0) విఫలమయ్యారు. బ్యాటింగ్ చేస్తూ మధ్యలో మైదానాన్ని వీడిన కెప్టెన్ పొలార్డ్ మళ్లీ వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. పొలార్డ్ ఆట చివరికి 14 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ 2, ముస్తాఫిజూర్ రహమాన్ 2, షోరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తీశారు.
West Indies
Bangladesh
Super-12
Group-1
T20 World Cup

More Telugu News